GOD FATHER ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గెస్ట్ ?

Wednesday,September 07,2022 - 11:48 by Z_CLU

Pawan Kalyan as chief guest for God Father Pre-Release event ?

మెగాస్టార్ చిరంజీవి -సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ‘గాడ్ ఫాదర్’ రిలీజ్ కి రెడీ అయింది. దసరా స్పెషల్ గా అక్టోబర్ 5న సినిమా థియేటర్స్ లోకి రాబోతుంది. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తుంది. త్వరలోనే భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్  చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఆ ఈవెంట్ లో ట్రైలర్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ ఎలాగో వస్తారు. కానీ స్పెషల్ గెస్ట్ గా ఎవరొస్తారు ? అనే ఆసక్తి మెగా ఫ్యాన్స్ లో నెలకొంటుంది.

తాజా సమాచారం మేరకు ఈ మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చాలా మంది దర్శకులు , నిర్మాతలు వస్తారని తెలుస్తుంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నాడని సమాచారం. దీనిపై మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ లేదు కానీ పవన్ గెస్ట్ గా రావడం పక్కా అని వినిపిస్తుంది. మెగా స్టార్ చిరు నటించిన ‘సైరా నరసింహా రెడ్డి’ ఈవెంట్ కి పవన్ గెస్ట్ గా వచ్చారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఏ ఈవెంట్ లో కనిపించలేదు.

ఇప్పుడు మళ్ళీ ఒకే వేదికపై కనిపించనున్నారని అదీ సల్మాన్ ఖాన్ తో మెగా బ్రదర్స్ ఫ్రేం చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఉన్నారు. త్వరలోనే గాడ్ ఫాదర్ ఈవెంట్ గురించి అలాగే పవన్ గెస్ట్ గా రాబోతున్న విషయంపై మేకర్స్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics