పవన్ అలా కనిపిస్తాడట ...

Tuesday,March 14,2017 - 05:00 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే.. ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో పవన్ సరి కొత్త క్యారెక్టర్ తో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడట..


ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమాలో పవన్ ఓ సాఫ్ట్ వెర్ గా కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తుంది..ఇప్పటికే ఈ సినిమా కోసం ఆర్.ఎఫ్.సిటీ లో ఓ పెద్ద సాఫ్ట్ వెర్ కంపెనీ సెట్ కూడా వేసారట యూనిట్… ఆర్ట్ డైరెక్టర్ ఏ.ఎస్.ప్రకాష్ ఆధ్వర్యం లో ఈ భారీ సెట్ వేశారని సమాచారం.. మరి ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో ఎంటర్టైన్ చేసిన వీరిద్దరి కాంబో లో రానున్న ఈ మూడో సినిమా పై భారీ అంచనాలున్నాయి..