Pawan Kalyan - ఆ దర్శకుడికి ఛాన్స్ ఇస్తాడా?

Wednesday,June 09,2021 - 11:27 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేస్తుండటంతో ఆయనతో సినిమాలు చేయాలనుకునే డైరెక్టర్స్ అందరూ క్యూ కడుతున్నారు. ప్రస్తుతం పవన్ లైనప్ భారీగా ఉండటంతో పవర్ స్టార్ తో ఎప్పటికయినా ఓ సినిమా చేయాలని చూస్తున్నారు కొందరు దర్శకులు. ఇప్పటికే పవన్ చేస్తున్న దర్శకులు కాకుండా నెక్స్ట్ లిస్టులో సురేందర్ రెడ్డితో పాటు మిగతా దర్శకులు కూడా ఉన్నారు. తాజాగా ఆ లిస్టులో అనిల్ రావిపూడి పేరు కూడా వినబడుతుంది. అవును త్వరలోనే పవన్ తో అనిల్ రావిపూడి సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతుంది.

ఈ వార్తలో నిజం లేకపోలేదు. పవన్ తో వకీల్ సాబ్ చేస్తుండగానే దిల్ రాజు తమ బేనర్ లో మరో సినిమా చేయాలని పవర్ స్టార్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ సమయంలో అనిల్ రావిపూడి పేరు కూడా సూచించాడు. దానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఉచ్చాడు కూడా. కాకపోతే ఈ కాంబో సినిమా ఇప్పుడే ఉండదు పవన్ ముందు తను కమిట్ అయిన సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ఈ లోపు అనిల్ రావిపూడి కూడా బాలయ్య సినిమా , దాని తర్వాత రామ్ తో ఓ సినిమా చేసుకొస్తాడు.

anil ravipudi

దర్శకుడు అనీల్ రావిపూడి

ఈ కాంబినేషణ్ లో సినిమా అయితే పక్కా ఉంటుంది. కానీ ఇప్పుడప్పుడు ఉండకపోవచ్చు. ఎంతలేదన్నా రెండేళ్ళపైనే పట్టొచ్చు. మరి అప్పటికి లెక్కలు మారకుండా ఉంటే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ చేస్తాడు పవన్. F2 తో స్టార్ హీరోలకు మరింత దగ్గరయిన అనిల్ రావిపూడి కి పవన్ కచ్చితంగా అవకాశం ఇస్తాడనుకోవచ్చు. ఎలాగు దిల్ రాజు నిర్మాత కాబట్టి ఈ కాంబోని వీలైనంత త్వరగా సెట్ చేసే ప్రయత్నం చేస్తాడు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics