పవన్ కల్యాణ్-అమీర్ ఖాన్ కాంబినేషన్....

Monday,December 19,2016 - 09:35 by Z_CLU

ఊహించుకుంటేనే వెరైటీగా ఉంది కదా… టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమిర్ ఖాన్. వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తే భలేగా ఉంటుంది. కానీ అది సాధ్యం కాదులెండి. ఎందుకంటే, సినిమాల ఎంపికలో ఇద్దరివీ రెండు దారులు. కానీ ఇప్పుడు ఈ ప్రస్తావన రావడానికి కారణం అమీర్ ఖాన్. తన కొత్త సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన అమీర్… పవన్, చిరంజీవి గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు. వాళ్లంటే తనకు ఎంతో ఇష్టమని ప్రకటించాడు. కుదిరితే వాళ్లతో కలిసి పనిచేయాలని ఉందని కూడా ఎనౌన్స్ చేశాడు. అమీర్ కొత్త సినిమా దంగల్ త్వరలోనే తెలుగులో విడుదలకానుంది. దీనికి తెలుగులో యుద్ధం అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో అమీర్ ఖాన్ మల్లయోధుడిగా కనిపించాడు.