పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' మూవీ ప్రీ లుక్ రిలీజ్

Thursday,November 23,2017 - 06:33 by Z_CLU

పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ మూవీ ప్రీ లుక్ రిలీజయింది. ఈ నెల 27 నుండి కాశీలో ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ ని బిగిన్ చేయనున్న సినిమా యూనిట్, సరిగ్గా అదే రోజు ఈ మూవీ టైటిల్  ని   రిలీజ్ చేయనున్నారు. గతంలో కాన్సెప్ట్   పోస్టర్ రిలీజ్ చేసి సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేసిన సినిమా యూనిట్, ఇప్పుడు ప్రీ లుక్ రిలీజ్ చేసి, ఆల్ రెడీ జెనెరేట్ అయిన క్యూరాసిటీ డోస్ పెంచేశారు.

 

జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తరవాత మళ్ళీ తెరపైకి వస్తున్న ఈ కాంబోపై ఇప్పటికే హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయి ఉన్నాయి. దానికి తోడు ఇటు పవన్ కళ్యాణ్ ఇమేజ్, అటు త్రివిక్రమ్ మార్క్ ఎంటర్ టైన్ మెంట్ ఎక్స్ పెక్ట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఈ నెల 27 న రిలీజ్ కానున్న టైటిల్ పోస్టర్ మరింత హీట్ ని జెనెరేట్  చేయనుంది.

 

త్రివిక్రమ్ మార్క్ హై ఎండ్ ఫ్యామిలీ ఇమోషన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ తో పాటు అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్ నటిస్తున్నారు. హారిక & హాసిని ప్రొడక్షన్స్ బ్యానర్ పై S. రాధాకృష్ణ  నిర్మిస్తున్న  ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ కంపోజర్.