Pawan Kalyan - లైన్లో మరో ఇద్దరు దర్శకులు

Wednesday,April 28,2021 - 03:43 by Z_CLU

చిన్న గ్యాప్ తర్వాత ‘వకీల్ సాబ్’ తో వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ వరుసగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు పవన్ నెక్స్ట్ లిస్టు లో దాదాపు అరడజను పైనే సినిమాలు వెయిటింగ్ లో ఉన్నాయి. క్రిష్, సాగర్ కే చంద్ర, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి ఇలా వరుసగా దర్శకులతో సినిమాలు లాక్ చేశాడు పవన్. అయితే ఇప్పుడు ఉన్నపళంగా పవన్ లిస్టు లో మరో సినిమా చేరనుందని అంటున్నారు. అవును పవన్ తో వకీల్ సాబ్ తీసిన దిల్ రాజు పవర్ స్టార్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.

నెక్స్ట్ సినిమా కోసం పవన్ కి ఓ అడ్వాన్స్ కూడా ఇచ్చాడట దిల్ రాజు. అయితే ‘వకీల్ సాబ్’ టాక్ బాగున్నా కొన్ని ఏరియాల్లో కరోన ప్రభావం , టికెట్ రేట్లు తగ్గడం వల్ల కొన్న డిస్ట్రిబ్యూటర్స్ నష్టాలు చూశారు. విషయం తెలుసుకొని దిల్ రాజు కి మరో సినిమా ఇచ్చి మంచి స్క్రిప్ట్ తెచ్చుకోమని మాటిచ్చాడట పవన్. ప్రస్తుతం దిల్ రాజు అదే పనిలో ఉన్నారని శ్రీ రామ్ లేదా వంశీ పడిపల్లి ఈ ఇద్దరిలో ఒకరితో సినిమా సెట్ చేసే ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తుంది.

మహర్షి తర్వాత వంశీ పడిపల్లి కొందరు హీరోలకు కథ వినిపించాడు కానీ ఏదీ వర్కౌట్ అవ్వలేదు. అయితే ఇటివలే పవన్ కోసం ఆయన కథ రెడీ చేసి దిల్ రాజు కి వినిపించాడని అంటున్నారు. ఇక వకీల్ సాబ్ లో శ్రీరామ్ వేణు చేసిన మార్పులు అందరికీ నచ్చాయి. దీంతో ఆ దర్శకుడికే మళ్ళీ పవన్ అవకాశం ఇవ్వాలని చూస్తున్నాడని అంటున్నారు. ఈ ఇద్దరిలో దర్శకుడు ఎవరనేది ఫైనల్ అవ్వలేదు కానీ దిల్ రాజు -పవన్ కాంబో మాత్రం పక్కా అని టాక్ వినబడుతుంది. మరి చేస్తున్న సినిమాలు పక్కన పెట్టి పవన్ దిల్ రాజు సినిమాను ముందుకు తీసుకోస్తాడా లేదా షూటింగ్ స్టేజిలో ఉన్న రెండు సినిమాలు పూర్తి చేశాక ఆ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా పవన్ రీ ఎంట్రీ సినిమాతో తన డ్రీం నెరవేర్చుకున్న దిల్ రాజు కి మరో బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నాడు పవన్. మరి ఈ కాంబోలో రాబోయే సినిమా ఉండబోతుందో చూడాలి.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics