టాలీవుడ్ నంబర్ వన్ పవర్ స్టార్

Monday,December 18,2017 - 11:31 by Z_CLU

యూట్యూబ్ వ్యూస్ పరంగా టాలీవుడ్ లో నంబర్ వన్ స్టార్ గా నిలిచాడు పవన్ కల్యాణ్. తాజాగా విడుదలైన అజ్ఞాతవాసి టీజర్ తో ఈ ఘనత సాధించాడు. అజ్ఞాతవాసి టీజర్ కు 24 గంటల్లో 6.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటివరకు టాలీవుడ్ కు సంబంధించి ఇదే హయ్యస్ట్.

అజ్ఞాతవాసి టీజర్ తర్వాత జై లవకుశ టీజర్, గ్లింప్స్ ఆఫ్ స్పైడర్ వరుసగా 2,3 స్థానాల్లో నిలిచాయి. ప్రస్తుతం అజ్ఞాతవాసి టీజర్ మరిన్ని వ్యూస్, లైక్స్ తో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ టీజర్ కు 76 లక్షలకు పైగా వ్యూస్ ఉన్నాయి. వీటిలో 4లక్షల 45వేల లైక్స్ కూడా ఉన్నాయి. ఇన్ని లైక్స్ పొందిన టీజర్ కూడా ఇదే.

ఓవరాల్ గా సౌత్ లో చూసుకుంటే రెండో స్థానంలో కొనసాగుతున్నాడు పవన్. మెర్సల్ టీజర్ తో మొదటి స్థానంలో ఉన్నాడు విజయ్. ఆ సినిమా టీజర్ కు 24 గంటల్లో 11 మిలియన్ వ్యూస్ ఉన్నాయి.