హాట్ టాపిక్: ట్విట్టర్ లో Pawan Kalyan

Friday,September 04,2020 - 01:46 by Z_CLU

సహజంగా స్టార్ హీరో పుట్టినరోజు నాడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్, అలాగే మిగతా సెలెబ్రిటీస్ విషెస్ చెప్పడమే కామనే. అయితే తమ విషెస్ ఆ హీరో వరకూ వెళ్తాయా ? అసలు అన్ని tweets చూసే టైం అతనికి ఉంటుందా ? అంటే మాత్రం ఠక్కున జవాబు చెప్పలేం. కానీ సెలబ్రిటీస్ తో పాటు తనకు విష్ చేసిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరున థాంక్స్ చెప్తూ హీరో రిప్లయ్ ఇస్తే అది హాట్ టాపిక్ అవుతుంది.

అవును.. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. సెప్టెంబర్ 2 Pawan Kalyan జన్మదినం సందర్భంగా చిన్నా చితకా హీరోలు , బడా దర్శక నిర్మాతలు అలాగే సోషలిస్టులు ఇలా అందరూ Power Star ని తమ tweets ద్వారా Twitter లో విష్ చేసారు. అక్కడి వరకూ బాగానే ఉంది. కానీ ఉన్నపళంగా ఒక్కొక్కరికీ పవన్ ID నుండి రిప్లై రావడం అందరినీ షాక్ కి గురిచేసింది.

ఒకటి రెండు కాదు తనను విష్ చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్మోస్ట్ రిప్లై ఇచ్చాడు పవన్. ఇంత మందికి పవన్ రిప్లై పెట్టడం దాన్ని స్క్రీన్ షాట్ పెట్టుకొని రిప్లై అందుకున్న వాళ్ళు సోషల్ మీడియాలో మళ్ళీ షేర్ చేసుకోవడం హాట్ టాపిక్ అయింది. పవన్ నుండి రిప్లై వస్తుందని ఊహించని ఎంతోమంది రిప్లై వచ్చాక పండగ చేసుకున్నారు.