మరో సారి రచయితగా మారనున్న పవన్ ?

Tuesday,July 19,2016 - 08:20 by Z_CLU

 

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో సారి రచయితగా మారనున్నాడనే వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతుంది. అయితే గతం లో పవన్ తన దర్శకత్వం లో రూపొందిన ‘జాని’ తో రచయితగా మారి ఇటీవలే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాకు కూడా రచయితగా పని చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు మరో సారి తాను నటిస్తున్న తాజా సినిమాకు పవన్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తుంది. డాలి దర్శకత్వం లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఆకుల శివ తో కలిసి పవన్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని సమాచారం. అయితే రచయితగా పని చేసిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం తో ఈ సారి మాత్రం పవన్ ఆ తప్పు జరగ కూడదని భావిస్తున్నట్లు వినికిడి. మరి ఈ వార్త లో ఎంత నిజం ఉందొ? తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే. ఫ్యాక్షన్ బాగ్రాప్ లో లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రం లో పవన్ లుక్ తో పాటు డైలాగ్స్ అలాగే సన్నివేశాలు బాగా అలరిస్తాయని చెప్పుకొస్తున్నారు చిత్ర యూనిట్.