పవన్ కల్యాణ్ రామేశ్వరం లింక్

Sunday,October 02,2016 - 02:58 by Z_CLU

కాటమరాయుడు సినిమా ఈమధ్యే సెట్స్ పైకి వచ్చింది. పవన్ కల్యాణ్-శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే అంతే త్వరగా ఫస్ట్ షెడ్యూల్ కూడా ముగించుకుంది. అవును… హైదరాబాద్ లో ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. బుధవారం (అక్టోబర్ 5) నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. అయితే ఆ షెడ్యూల్ రామేశ్వరంలో ప్రారంభం కానుండడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది

ఏదో ప్రత్యేకత ఉంటే తప్ప రామేశ్వరంలో ఎవరూ షూటింగ్ పెట్టుకోరు. పవన్ సినిమాకు కూడా కథ ప్రకారం అలాంటి ప్రత్యేకత ఏదో ఉండే ఉంటుందంటున్నారు చాలామంది. ఆ షెడ్యూల్ లో శృతిహాసన్ కూడా జాయిన్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే పవన్ కల్యాణ్ సినిమాను ప్రత్యేకంగా రామేశ్వరంలోనే ఎందుకు షూట్ చేయబోతున్నారనే విషయంపై మాత్రం యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు.

అటు సినిమాలో పవన్ తమ్ముళ్లుగా నటించే నటుల్ని ఎంపికచేసినట్టు వార్తలు వస్తున్నాయి. మూవీలో పవన్ కు నలుగురు తమ్ముళ్లు ఉండగా.. ఆ పాత్రల కోసం శివబాలాజీ, అజయ్, కమల్ కామరాజును సెలక్ట్ చేసినట్టు చెబుతున్నారు. మరో తమ్ముడి పాత్ర కోసం నటుడ్ని వెదుకుతున్నారు.