మరోసారి పాటపాడిన పవన్ కల్యాణ్

Friday,December 22,2017 - 10:55 by Z_CLU

అజ్ఞాతవాసి సినిమా కోసం పవన్ మరోసారి సింగర్ గా మారాడు. అనిరుధ్ సంగీత దర్శకత్వంలో ఈ పాటను నిన్ననే కంపోజ్ చేశారు. భాస్కరభట్ల ఈ పాటను సాహిత్యం అందించాడు. న్యూ ఇయర్ గిఫ్ట్ గా డిసెంబర్ 31 రాత్రి ఈ పాటను విడుదల చేయబోతున్నారు.

అజ్ఞాతవాసి సినిమాకు సంబంధించి ఇప్పటికే ఆడియో రిలీజైంది. ఆల్బమ్ లో మొత్తం 5 పాటలున్నాయి. ఇప్పుడా పాటలకు కొనసాగింపుగా పవన్ పాడిన సాంగ్ కూడా యాడ్ కాబోతోంది. ఇంతకుముందు పవన్ పాడిన పాటల స్టయిల్ లోనే ఇది కూడా ఫోక్ స్టయిల్ లో సాగనుంది.

అత్తారింటికి దారేది సినిమాలో కూడా “కాటమరాయుడా..” అనే లిరిక్స్ తో ఓ పాట పాడాడు పవన్. తాజా మూవీలో “కొడకా..కోటేశ్వరరావా..” అనే లిరిక్స్ తో ఈ పాట సాగనుంది. ఈ పాటతో సినిమాపై హైప్ మరింత పెరగనుంది.