Pawan Kalyan - మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్

Thursday,April 22,2021 - 04:26 by Z_CLU

మూడేళ్ళ గ్యాప్ తర్వాత ‘వకీల్ సాబ్’ తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ జెట్ స్పీడులో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో ‘హరి హర వీరమల్లు’ అనే పిరియాడిక్ డ్రామా సినిమా చేస్తున్న పవన్.. మరో వైపు సాగర్ చంద్ర దర్శకత్వంలో రానాతో కలిసి ఓ రీమేక్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలతో బిజీగా ఉన్న పవన్ నెక్స్ట్ హరీష్ శంకర్ తో మైత్రి మూవీ మేకర్స్ బేనర్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాతో పాటే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు.

అయితే తాజాగా పవన్ కి సంబంధించి మరో అప్ డేట్ బయటికొచ్చింది. నిర్మాత పుల్లారావు బేనర్ లో ఓ సినిమా చేయనున్నాడట పవన్. ఈ విషయాన్ని నిర్మాత పుల్లారావు స్వయంగా మీడియాతో పంచుకున్నాడు. పవన్ కోసం ఓ మంచి కథను లాక్ చేశామని త్వరలోనే ఆ సినిమా ఉంటుందని చెప్పుకున్నాడు. దీంతో పవన్ లిస్టులో మరో సినిమా అంటూ సోషల్ మీడియాలో ఈ సినిమా హాట్ టాపిక్ అవుతుంది.

ప్రస్తుతానికైతే డైరెక్టర్ ఎవరూ ? కథ ఏమిటి ? అనేవి బయటికి రాలేదు కానీ ఈ సినిమా వచ్చే ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుందని టాక్ వినబడుతుంది. ఈ సినిమాలో పవన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనుందని అంటున్నారు. ఈ మేరకూ బేనర్ నుండి రకుల్ కి అడ్వాన్స్ కూడా వెళ్లిందని సమాచారం.

Pawan Kalyan latest update

ఈ సినిమాను ఓ కొత్త దర్శకుడు డీల్ చేస్తాడని అప్పుడే రూమర్స్ బయలుదేరాయి. ప్రస్తుతం పవన్ తన చేతిలో ఉన్న 4 సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. అవన్నీ కంప్లీట్ అయ్యాకే ఈ కమిట్ మెంట్ గురించి ఆలోచిస్తాడు. అప్పటివరకు అన్నీ సెట్ అయితే ఈ ప్రాజెక్ట్ వెంటనే సెట్స్ పైకి తీసుకొస్తాడు పవన్.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics