నాగ్ సినిమాపై పవన్ కన్ను

Wednesday,October 05,2016 - 03:14 by Z_CLU

గుండెజారి గల్లంతయిందే, పిల్ల నువ్వు లేని జీవితం, ఆకాశం అమ్మాయైతే, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, కెవ్వు కేక…. ఇవన్నీ సినిమా పేర్లు. కానీ అవి సినిమా పేర్లుగా మారకముందే పవన్ పాటల్లో వినిపించాయి. సూపర్ హిట్ అయిన ఎన్నో పవన్ సాంగ్స్ సినిమాలుగా మారిపోయాయి. కానీ ఫస్ట్ టైం పవన్… మరో హీరో పాటను తన సినిమా టైటిల్ గా మార్చుకోవాలనుకుంటున్నాడు.

8139e5c07fdd222e183c908a94956713_pt_xl

నాగార్జున నటించిన సంతోషం సినిమాలో దేవుడే దిగి వచ్చినా… స్వర్గమే రాసిచ్చినా అనే పాటలో తొలి రెండు పదాల్ని పవన్ కొత్త సినిమాకు టైటిల్ గా అనుకుంటున్నారట. పవన్-త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమాకు దేవుడే దిగివచ్చినా అనే టైటిల్ ను సీరియస్ గా పరిశీలిస్తున్నారట.