పవన్ ‘ధృవ’ కనెక్షన్

Friday,October 21,2016 - 01:33 by Z_CLU

ప్రస్తుతం రామ్ చరణ్ ధృవ సినిమా చేస్తున్నాడు. అటు పవన్ కల్యాణ్ కాటమరాయుడు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు పవన్ కల్యాణ్ కు ధృవ కనెక్షన్ ఏర్పడింది. అవును… ధృవ సినిమా ఆడియో ఫంక్షన్ కు పవన్ కల్యాణ్ ను స్పెషల్ గెస్ట్ గా ఆహ్వానించడానికి తెరవెనక ఏర్పాట్లు జరుగుతున్నాయి.

cntr5skukaatptg

నాయక్ సినిమా తర్వాత చెర్రీ నటించిన ఏ సినిమా ఫంక్షన్ కూ పవన్ కల్యాణ్ గెస్ట్ గా హాజరవ్వలేదు. మళ్లీ ఇన్నేళ్లకు ధృవ సినిమాతో చెర్రీ-పవన్ ఒకే వేదికపైకి వస్తున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే టీజర్ తో హల్ చల్ చేస్తున్న ధృవ సినిమా ఆడియోను వచ్చేనెల 20న విడుదల చేయాలని అనుకుంటున్నారు.