#Republic తేజ్ కోసం పవన్ కళ్యాణ్ !

Saturday,September 25,2021 - 11:11 by Z_CLU

సాయి ధరం తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తేజ్ హాస్పిటల్ లో కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో సాయి తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ సినిమా రిలీజ్ అవుతుందా ? అనుకున్నారంతా. కానీ మేకర్స్ ప్రకటించిన డేట్ కే సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. వరుస ప్రమోషన్ ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే తేజ్ కోసం మెగా స్టార్ చిరు రంగంలోకి దిగి ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా అంచనాలు పెంచారు. చిరు విడుదల చేయడంతో ట్రైలర్ బాగా రీచ్ అయింది.

అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది. అవును మేనల్లుడి సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నాడు. నేడు జరగనున్న ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ చీఫ్ గెస్ట్ గా ఎటెండ్ అయి సినిమా గురించి గట్టిగా చెప్పబోతున్నారు. పవన్ ఇటివలే రషెస్ కూడా చూసారని ఈరోజు సినిమాపై తన ఒపినియన్ తో పాటు సినిమా ఎలా ఉండబోతుందో కూడా చెప్తారని సమాచారం. అలాగే తేజ్ ఆరోగ్యం గురించి కూడా పవన్ అప్ డేట్ ఇవ్వనున్నాడు. ఇంకా ఏం మాట్లాడతారో చూడాలి. ఇలా మేనల్లుడి సినిమా కోసం మెగా బ్రదర్స్ రంగంలోకి దిగి ‘రిపబ్లిక్’ ని తమ వంతుగా ప్రమోట్ చేస్తున్నారు.

pawan sai tej republic pre release 2

దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ‘రిపబ్లిక్’ వచ్చే నెల 1న థియేటర్స్ లోకి రానుంది. JB ఎంటర్టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణి శర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలు , టీజర్ , ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ స్పీచ్ తో సినిమాపై మరింత బజ్ క్రియేట్ అవ్వడం , అంచనాలు మరిన్ని పెరగడం ఖాయమనిపిస్తుంది. మరి ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ తో పాటు మెగా హీరోలు కూడా హాజరవుతారేమో చూడాలి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics