పవన్ సినిమా షూటింగ్ రద్దు

Wednesday,May 31,2017 - 01:10 by Z_CLU

దర్శకరత్న దాసరి నారాయణరావు అకాల మరణంతో తన కొత్త సినిమా షూటింగ్ ను రద్దుచేశారు పవన్ కల్యాణ్. దాసరి మృతికి సంతాప సూచకంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ ను 3 రోజుల పాటు రద్దుచేశారు పవన్ కల్యాణ్. తెలుగు సినీపరిశ్రమ ఓ పెద్ద మనిషిని, ఆప్తుడిని కోల్పోయిందన్న పవన్.. దాసరి లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరన్నారు.

పవన్ కల్యాణ్ తో సినిమా చేద్దామని దాసరి చాలా ప్రయత్నించారు. ఒక దశలో పవన్ తో సినిమా కూడా ఎనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని పవన్ కూడా కన్ ఫర్మ్ చేశాడు. దాసరి నిర్మాతగా పవన్ హీరోగా రాబోయే సినిమాకు సంబంధించి కొంతమంది దర్శకులతో కథా చర్చలు కూడా సాగాయి.