ఇకపై జెట్ స్పీడ్ తో షూటింగ్...

Monday,October 10,2016 - 03:01 by Z_CLU

పవన్ హీరోగా నటిస్తున్న కాటమరాయుడు సినిమాలో నలుగురు తమ్ముళ్ల క్యారెక్టర్లు ఉన్నాయి. తమిళ సినిమాకు అన్-అఫీషియల్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో నలుగురు తమ్ముళ్ల పాత్రల్ని తాజాగా సెలక్ట్ చేశారు. గబ్బర్ సింగ్ లో పవన్ కు తమ్ముడిగా నటించిన అజయ్ ను ఈ సినిమాలో కూడా తమ్ముడి పాత్ర కోసం తీసుకున్నారు. ఇక రెండో తమ్ముడి పాత్ర కోసం కమల్ కామరాజును తీసుకున్నాడు. గతంలో పవన్ నటించిన జల్సాలో కమల్ కామరాజు ఉన్నాడు. మూడో తమ్ముడి పాత్ర కోసం సాయిబాలాజీని సెలక్ట్ చేశాడు. గతంలో పవన్ నటించిన అన్నవరం సినిమాలో సాయిబాలాజీ ఉన్నాడు.

collage

నాలుగో తమ్ముడిగా తాజాగా చైతన్య కృష్ణను ఎంపికచేశారు. నలుగురు తమ్ముళ్లలో ముగ్గురికి గతంలో పవన్ తో వర్క్ చేసిన అనుభవం ఉంది. కానీ నాలుగో తమ్ముడైన కల్యాణ్ కృష్ణకు మాత్రం పవన్ తో కలిసి పనిచేసిన అనుభవం లేదు. రీసెంట్ గా ప్రేమమ్ లో కీలక పాత్ర పోషించిన చైతన్య కృష్ణ… ఇప్పుడు కాటమరాయుడులో మరో కీలకమైన పాత్రలో కనిపించడానికి సిద్ధమౌతున్నాడు. ఈనెల 12 నుంచి కాటమరాయుడుకు సంబంధించి మరో కొత్త షెడ్యూల్ మొదలవుతుంది.