#BheemlaNayak - పవర్ ఫుల్ పోలీస్ గా పవన్

Monday,July 26,2021 - 05:58 by Z_CLU

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో అరడజను సినిమాలున్నాయి. వాటిలో సెట్స్ పై ఉన్న సినిమాల్లో ‘అయ్యప్పనుమ్ కోషియం’ ఒకటి. ఇప్పటికే సినిమాకు సంబంధించి గ్యాపులతో మూడు షెడ్యుల్స్ పూర్తి చేశారు యూనిట్. అయితే కరోన సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. మళ్ళీ ఈరోజు నుండి బ్యాలెన్స్ షూట్ మొదలు పెట్టారు. పవర్ స్టార్ ఈ రోజు నుండి షూటింగ్ లో పాల్గొంటున్నాడు. సినిమాలో పవర్ స్టార్ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే.

#BheemlaNayak ఈజ్ బ్యాక్ ఆన్ డ్యూటీ అంటూ పవన్ కళ్యాణ్ పోలిస్ డ్రెస్ లో ఉన్న బ్యాక్ స్టిల్ తో షూటింగ్ రేసుమ్ అంటూ మేటర్ తెలియజేశారు మేకర్స్. ఇక పవన్ కళ్యాణ్ చాలా ఏళ్ల తర్వాత్ మళ్ళీ పోలీస్ డ్రెస్ వేయడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఈరోజు నుండి పవన్ కళ్యాణ్ పై కొన్ని పోలీస్ స్టేషన్ సీన్స్ తీయబోతున్నారు. అలాగే పవన్ -రానా కాంబినేషన్ సీన్స్ కూడా తెరకెక్కించనున్నారు.

సితార ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్ , రానా సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ నెల 28 నుండి నిత్యా మీనన్ షూటింగ్ లో జాయిన్ అవ్వనుందని సమాచారం. వకీల్ సాబ్ తర్వాత పవన్ నటిస్తున్న ఈ సినిమాకు కూడా తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సెప్టెంబర్ కల్లా టోటల్ షూట్ ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అన్ని అనుకున్నట్లే జరిగితే సినిమాను సంక్రాంతి కి రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics