Pawan Kalyan - ఇకపై పూర్తిస్థాయి నిర్మాతగా..!

Friday,April 02,2021 - 05:14 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఓ బ్యానర్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. దాని పేరు పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్. అయితే ఈ బ్యానర్ పై రెగ్యులర్ గా సినిమాలు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాడు పవన్. ఎట్టకేలకు ఈ బ్యానర్ నుంచి ఇకపై వరుసగా సినిమాలు రాబోతున్నాయి.

పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా బ్యానర్లు కలిశాయి.

పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై పవన్, పీపుల్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాతలుగా ఇకపై వరుసగా సినిమాలు రాబోతున్నాయి. ప్రస్తుతానికి 15 సినిమాలు ప్లాన్ చేశారు.

ఈ 15 సినిమాల్లో 6 స్మాల్ బడ్జెట్ సినిమాలు కాగా.. మరో 6 మీడియం రేంజ్ బడ్జెట్ మూవీస్. ఇంకో 3 భారీ బడ్జెట్ సినిమాలు. వీటిలో ఎక్కువ సినిమాలతో ఔత్సాహిక కథారచయితలు, దర్శకులు, టెక్నీషియన్స్ ను పరిచయం చేయబోతున్నారు.

ఈ రెండు బ్యానర్ల జాయింట్ వెంచర్ గా వచ్చే మొదటి సినిమా డీటెయిల్స్ త్వరలోనే బయటకురానున్నాయి.