మే 26న 'మళ్ళీ పెళ్లి'

Wednesday,May 03,2023 - 02:00 by Z_CLU

 డా. నరేష్ వి.కె గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ ‘మళ్ళీ పెళ్లి’ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది. యూనిక్ కథతో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో పవిత్ర లోకేష్ కథానాయిక.  మెగా మేకర్ ఎంఎస్ రాజు రచన  దర్శకత్వం వహిస్తున్నారు.  విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా దీనిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

ఫస్ట్ లుక్,  గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. మళ్లీ పెళ్లి వేసవిలో మే 26న విడుదల కానుంది. విడుదల తేదీ పోస్టర్‌లో నరేష్ , పవిత్ర లోకేష్ తమ అనురాగ బంధాన్ని పంచుకున్నారు. పోస్టర్‌లో ఒకరినొకరు ప్రేమగా కౌగిలించుకుంటూ కనిపించారు.

సురేష్ బొబ్బిలి, అరుల్‌దేవ్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, జునైద్ సిద్ధిక్ ఎడిటర్. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా, భాస్కర్ ముదావత్ ప్రొడక్షన్ డిజైనర్.

జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో వనిత విజయకుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు నటిస్తున్నారు.

తారాగణం: డాక్టర్ నరేష్ వికె, పవిత్ర లోకేష్, జయసుధ, శరత్ బాబు, వనిత విజయకుమార్, అనన్య నాగళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు