మరో పుత్రుని ఫస్ట్ లుక్

Tuesday,December 06,2016 - 12:00 by Z_CLU

 బాలకృష్ణ గౌతమీపుత్ర శాతకర్ణీ నుండి మరో ఫస్ట్ లుక్ రిలీజయింది. ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు కన్నడ సూపర్ స్టార్ ‘శివరాజ్ కుమార్’. ఈ హిస్టారికల్ మూవీలో శివరాజ్ గెటప్ చూస్తుంటే బుర్రకథ చెప్పే హరిదాసు క్యారెక్టర్ లా తెలుస్తుంది.

ఇప్పటి వరకు ఏ ఇతర భాషా చిత్రాల్లోనూ నటించని శివ రాజ్ కుమార్, ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించడం విశేషం. శివరాజ్ కుమార్ గారి తల్లి పార్వతమ్మ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఆయన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.

సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ని గౌతమీపుత్రుని గొప్పతన్నాన్ని ఎలివేట్ చేయడానికి వాడుకున్న డైరెక్టర్, మరి ఈ పార్వతీ పుత్రుణ్ణి ఎలా ప్రెజెంట్ చేస్తున్నాడో సినిమా చూస్తే కానీ తెలీదు.