2021 Year End Special : బెస్ట్ సాంగ్స్ ఇవే (Part 1)

Wednesday,December 22,2021 - 07:02 by Z_CLU

Part 1 : 2021 Year End Special Tollywood Best Songs

మన లైఫ్ లో మ్యూజిక్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకే ఏదైనా మూవీ నుండి కొత్త సాంగ్ వస్తే, వెంటనే వినేసి నచ్చేస్తే, మళ్ళీ మళ్ళీ వింటూనే ఉంటాం. మరి ఈ ఏడాది మ్యూజిక్ లవర్స్ పదే పదే విని, భారీ వ్యూస్ అందించిన టాలీవుడ్ బెస్ట్ సాంగ్స్ ఏంటో ఓ లుక్కేద్దాం.

సారంగ దరియా

ఈ ఏడాది బెస్ట్ సాంగ్స్ లిస్టు లో టాప్ ప్లేస్ లో నిలిచింది ‘సారంగ దరియా’. పవన్ సీ.హెచ్ కంపోజ్ చేసిన ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించారు. ముఖ్యంగా సాయి పల్లవి డాన్స్ కి ఉన్న క్రేజ్ తో సాంగ్ సోషల్ మీడియాలో రికార్డుల దుమ్ము దులిపేసింది. ఈ సాంగ్ లవ్ స్టోరీ సినిమాకు థియేటర్స్ కి రప్పించడంలో కీలక పాత్ర పోషించింది. కొన్ని నెలల పాటు ఎక్కడ విన్నా ఈ పాటే వినబడింది. ఫైనల్ గా ఈ ఇయర్ బెస్ట్ సాంగ్ గా రికార్డ్ వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

లాహే… లాహే

మెగా స్టార్ చిరంజీవి -మణిశర్మ కాంబినేషన్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. ఆ లిస్టు లో మరో సాంగ్ చేరింది. చాలా గ్యాప్ తర్వాత చిరు -మణి కాంబోలో ‘ఆచార్య’ సినిమా వస్తుంది. ఈ సినిమా నుండి విడుదలయ్యే సాంగ్స్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆ ఎక్స్ పెక్టేషన్స్ ని మొదటి సింగిల్ తోనే రీచ్ అయి సూపర్ హిట్ సాంగ్ ఇచ్చారు మణిశర్మ. ఆచార్య నుండి విడుదలైన ‘లాహే లాహే’ భారీ వ్యూస్ తో పాపులర్ సాంగ్ అయిపోయింది. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం పాటకు ప్రాణం పోయగా హారిక , సాహితి సింగింగ్ కూడా ప్లస్ అయింది.

అఖండ

ఈ మధ్య కాలంలో బాలకృష్ణ సినిమా పాటలు అంతగా పాపులర్ అవ్వలేదు. కానీ బాలయ్య -తమన్ కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ’ మాత్రం బెస్ట్ ఆల్బం అనిపించుకుంది. ముఖ్యంగా ‘భం అఖండ’ సాంగ్ తో పాటు ‘జై బాలయ్య’ సాంగ్ ఒక ఊపు ఊపేసింది. ఈ రెండు పాటలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ముఖ్యంగా జై బాలయ్య సాంగ్ ఫ్యాన్స్ కి బహుమతిలా నిలిచిపోయింది.

భీమ్లా నాయక్

‘వకీల్ సాబ్’ ఆల్బంతో పవర్ స్టార్ కి బెస్ట్ సాంగ్స్ ఇచ్చిన తమన్ మరోసారి పవన్ -కళ్యాణ్ సినిమా ‘భీమ్లా నాయక్’ కి అదిరిపోయే సాంగ్స్ ఇచ్చాడు. భీమ్లా నాయక్ అనే టైటిల్ సాంగ్ ఫ్యాన్స్ కి పూనకం తెప్పించేలా కంపోజ్ చేశాడు తమన్. ఈ సాంగ్ తో మొగులయ్య అనే విలేజ్ సింగర్ ని టాలీవుడ్ కి పరిచయం చేశారు. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం తమన్ , శ్రీ కృష్ణ ,పృథ్వీ చంద్ర, రామ్ మిర్యాల సింగింగ్ కూడా కలిసొచ్చింది. అలాగే లాలా భీమ్లా అనే సాంగ్ కూడా పాపులర్ నంబర్ అనిపించుకుంది. ఈ సాంగ్ కి త్రివిక్రమ్ సాహిత్యం అందించడం విశేషం.

నాటు నాటు

RRR నుండి ఇప్పటి వరకూ విడుదలైన పాటలన్నీ ఒకెత్తు తాజాగా రిలీజ్ అయిన నాటు నాటు ఒకెత్తు. అవును మాస్ లిరిక్స్ తో ఎన్టీఆర్ , చరణ్ ఎనర్జిటిక్ డాన్స్ విజువల్స్ తో లిరికల్ వీడియో బాగా వైరల్ అయింది. రాజమౌళి -కీరవాణి కాంబినేషన్ లో ఇప్పటికే చాలా మాస్ సాంగ్స్ వచ్చినప్పటికీ వాటిలో నాటు నాటు బెస్ట్ ప్లేస్ లో నిలిచేలా ఉంది. సినిమాలో కూడా ఈ సాంగ్ హైలైట్ అవ్వనుందని లిరికల్ లో విజువల్స్ చూస్తే అర్థమవుతోంది.

శ్రీవల్లి

అల్లు అర్జున్ -సుకుమార్ -దేవి ఈ ముగ్గురి కలయికలో ఓ సినిమా రాబోతుందనగానే సినిమాపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ నెలకొంటాయి. ఆర్య , ఆర్య 2 తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ఇది. అందుకే దేవి ఈ ఆల్బం మీద స్పెషల్ కేర్ తీసుకున్నాడు. ప్రతీ సాంగ్ బెస్ట్ గా ఇచ్చాడు. కానీ ఆల్బంలో శ్రీవల్లి పాట మాత్రం ఆడియన్స్ విపరీతంగా నచ్చేసింది. అలాగే సమంత ‘oo అంటావా మావ oo oo అంటావా ‘ సాంగ్ తో పాటు సామి సామి , దాక్కో దాక్కో సాంగ్ సెన్సేషనల్ వ్యూస్ అందుకున్నాయి.

ఈ రాతలే

ప్రభాస్ , పూజ హెగ్డే కాంబినేషన్ లో రాధా కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘రాధే శ్యామ్’ సినిమాలోని “ఈ రాతలే” సాంగ్ కూడా ఈ ఇయర్ బెస్ట్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది. జస్టిన్ ప్రభాకర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా పాడటం విశేషం. అలాగే హరిణి సింగింగ్ కూడా సాంగ్ కి ప్లస్ అయింది. కృష్ణ కాంత్ లిరిక్స్ అందించిన ఈ సాఫ్ట్ మెలోడీ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ప్లే లిస్టు లో ప్లేస్ అందుకుంది.

లెహరాయి

బొమ్మరిల్లు భాస్కర్ – గోపి సుందర్ కాంబినేషన్ లో వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా ఆల్బం కూడా మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంది. కాకపోతే లెహరాయి సాంగ్ మాత్రం అదిరిపోయే రెస్పాన్స్దక్కించుకుంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు శ్రీమణి లిరిక్స్ ప్లస్ పాయింట్. తెలుగు పదాలతో మంచి సాహిత్యం అందించాడు శ్రీమణి. ఓవరాల్ గా అన్నీ కుదిరిన ఈ సాంగ్ మోస్ట్ పాపులర్ సాంగ్ లిస్టు లో చేరింది.

నువ్వంటే నాకు ప్రేమ

అప్పట్లో ‘పెళ్లి సందడి’ సాంగ్స్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో తెలిసిందే. మళ్ళీ అదే టైటిల్ తో వస్తున్నాం కాబట్టి ఆ రేంజ్ లోనే అందరినీ ఆకట్టుకునే సాంగ్స్ అందించాలని దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారు అలాగే కీరవాణి గారు ఫిక్స్ అయినట్టున్నారు. అందుకే పెళ్లి సందD ఆల్బంతో శ్రోతలను ఆకట్టుకున్నారు. రాఘవేంద్ర రావు , కీరవాణి , చంద్రబోస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ ఆల్బంలో అన్ని పాటలు బెస్ట్ సాంగ్స్ అనిపించుకున్నాయి కాకపోతే నువ్వంటే నాకు ప్రేమ సాంగ్స్ మాత్రం ది బెస్ట్ అనిపించుకుంది.

చిట్టి నీ నవ్వంటే

చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పటాసే అనే సాంగ్ కూడా ఈ ఇయర్ బెస్ట్ సాంగ్స్ లిస్టు లో చేరింది. నవీన్ పోలిశెట్టి , ఫరియా జంటగా తెరకెక్కిన ‘జాతిరత్నాలు’ సినిమాలోని ఈ లవ్ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ని ఎట్రాక్ట్ చేసి భారీ వ్యూస్ కొల్లగొట్టింది. రాధన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి రామ్ మిర్యాల పాడిన విధానం కూడా కలిసొచ్చింది.

ఒకే ఒక లోకం

ఈ ఏడాది చిన్న సినిమా నుండి రిలీజైన సాంగ్స్ కూడా భారీ వ్యూస్ కొల్లగొట్టి పాపులర్ అయ్యాయి. అందులో ‘ఒకే ఒక లోకం’ సాంగ్ ఒకటి. ఆది సాయి కుమార్ , సురభి జంటగా నటించిన ‘శశి’ సినిమాలోని ఈ సాంగ్ బెస్ట్ సాంగ్ అనిపించుకుంది. అరుణ్ చిలువేరు కంపోజ్ చేసి సిద్ శ్రీరామ్ తో పాడించిన ‘ఒకే ఒక లోకం నువ్వు’ సాంగ్ ఈ ఇయర్ మోస్ట్ ఫేవరేట్ సాంగ్స్ లిస్టు లో మంచి ప్లేస్ అందుకుంది. ముఖ్యంగా సిద్ శ్రీరామ్ సింగింగ్, చంద్రబోస్ లిరిక్స్ మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకున్నాయి. ఈ సాంగ్ కోసమే సినిమా కెళ్ళిన వారెందరో. అంతగా రిలీజ్ కి ముందే మ్యూజిక్ లవర్స్ ఎట్రాక్ట్ చేసింది సాంగ్.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics