బ్లాక్ బస్టర్ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా మెగా హీరోతోనే ?

Sunday,September 02,2018 - 01:02 by Z_CLU

ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్స్ లో ‘గీత గోవిందం’ ఒకటి… ఎవరూ ఊహించని విధంగా సూపర్ హిట్ నుండి బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకెళ్లిన ఈ సినిమా… దర్శకుడు పరశురాంకి ఓ కొత్త ఇమేజ్ అందించింది.. ఈ సినిమా సాదించిన విజయంతోనే త్వరలో మెగా హీరోను డైరెక్ట్ చేయబోతున్నాడట పరశురాం.. దర్శకుడిగా ఇండస్ట్రీలో పదేళ్ళు పూర్తిచేసుకున్న ఈ దర్శకుడు ఇప్పటి వరకూ స్టార్ హీరోను  డైరెక్ట్ చేయలేదు. నాలుగేళ్ల నుండి అల్లు అర్జున్ తో సినిమా ప్లాన్ చేస్తున్నా ఎందుకో వర్కౌట్ అవ్వలేదు… ‘గీత గోవిందం’ కథను కూడా ముందుగా బన్నీ కే చెప్పాడు పరశురాం. ఈ కథ తనకి పర్ఫెక్ట్ కాదని భావించడంతో అల్లు అర్జున్ ప్లేస్ లోకి విజయ్ వచ్చాడు.

అయితే ‘గీత గోవిందం’ సమయంలోనే బన్నీ కోసం మరో కథను రెడీ చేసి అల్లు అరవింద్ తో పాటు బన్నీ వాస్ కి కూడా వినిపించాడట పరశురాం. ఈ కథ బాగా నచ్చడంతో వెంటనే ఓ ఫ్లాట్ ను అడ్వాన్స్ గా ఇచ్చేసానని ఈ మధ్యే బన్నీ వాస్ కూడా చెప్పాడు. ఇప్పుడు ఆ కథతో బన్నీ ని డైరెక్ట్ చేయబోతున్నాడట పరశురాం.. ప్రస్తుతం విక్రం కే. కుమార్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్న స్టైలిష్ స్టార్ నెక్స్ట్ చేయబోయే సినిమా ఇదేనని సమాచారం. సో పరశురాం ఎట్టకేలకు ఓ స్టార్ హీరోను డైరెక్ట్ చేయబోతున్నాడన్నమాట.