మహేష్ 27 ... ఆ దర్శకుడితో ఫిక్స్

Sunday,May 26,2019 - 11:01 by Z_CLU

ప్రస్తుతం మహర్షి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మహర్షి సెట్స్ పై ఉండగానే అనిల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మహేష్ బాబు… ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళకముందే మరో సినిమాను ఫైనల్ చేసేసుకున్నాడు. అనిల్ రావిపూడి సినిమా తర్వాత పరశురాంతో సినిమా చేయబోతున్నాడు మహేష్. ఇటివలే మహేష్ ని కలిసి కథ వినిపించిన పరశురాం తన నేరేషన్ తో సూపర్ స్టార్ ని ఇంప్రెస్ చేసేసాడట.

ప్రస్తుతం ఫ్యామిలీతో వెకేషన్ టూర్ లో ఉన్న మహేష్ రాగానే అనిల్ రావిపూడితో చేయబోయే సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేసి వెంటనే పరశురాం సినిమాను సెట్స్ పైకి తీసుకురావాలని భావిస్తున్నాడట సూపర్ స్టార్.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందని సమాచారం. ఎట్టకేలకు పరశురాం ఓ టాప్ హీరో అదీ సూపర్ స్టార్ ని డైరెక్ట్ చేయబోతు న్నాడన్నమాట.