పేపర్ బాయ్ మూవీ ట్రయిలర్ రిలీజ్

Saturday,August 18,2018 - 11:24 by Z_CLU

సంపత్ నంది బ్రాండ్ తో వస్తోంది పేపర్ బాయ్ సినిమా. తనే కథ అందించి, జయశంకర్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ సంపత్ నంది నిర్మించిన సినిమా ఇది. ఫస్ట్ లుక్ తో అందర్నీ ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా థియేట్రికల్ ట్రయిలర్ రిలీజైంది.

రోజూ పొద్దున్నే న్యూస్ పేపర్స్ వేసే ఓ కుర్రాడికి, విల్లాలో ఉండే  ధనిక అనే అమ్మాయికి మధ్య ఎలా ప్రేమ చిగురించింది. వాళ్ల ప్రేమ ఎలా సక్సెస్ అయిందనేది ఈ సినిమా స్టోరీ. ట్రయిలర్ మొత్తం చాలా రిచ్ గా ఉంది. భీమ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సౌందర్య రాజన్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ కానున్నాయి అర్థమవుతుంది.

వర్షం లాంటి బ్లాక్ బస్టర్ మూవీని డైరెక్ట్ చేసిన శోభన్ కొడుకు సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ సినిమాతో  రియా సుమన్ హీరోయిన్ గా పరిచయమౌతోంది. కీలక పాత్రలో మరో హీరోయిన్ తాన్యా హోప్ నటించింది. సెప్టెంబర్ 7న థియేటర్లలోకి వస్తున్నాడు పేపర్ బాయ్.