పందెంకోడి-2 మూడు రోజుల కలెక్షన్

Monday,October 22,2018 - 11:44 by Z_CLU

మాస్ హీరో విశాల్ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పందెంకోడి 2’. లైట్‌హౌస్ మూవీ మేకర్స్ ఎల్‌ఎల్‌పి పతాకంపై ఠాగూర్ మధు సమర్పణలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ పతాకాలపై విశాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 18న విడుదలై సూపర్ ఓపెనింగ్స్‌ సాధించింది.

ఈ చిత్రాన్ని 6 కోట్ల రూపాయలకు కొంటే 3 రోజుల్లోనే 4 కోట్ల 21 లక్షల 33 వేల 402 రూపాయల షేర్ సాధించి స్ట్రాంగ్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ‘పందెంకోడి’తో పెద్ద హిట్ సాధించిన విశాల్‌కి ఇప్పుడు ‘పందెంకోడి 2’ మరో సూపర్‌హిట్ కొట్టాడని అంటున్నారు ఠాగూర్ మధు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో 3 రోజులకు ‘పందెంకోడి 2’ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి

ఉత్తరాంధ్ర 57,16,358
ఈస్ట్ 25,62,668
వెస్ట్ 24,79,924
గుంటూరు 44,97,002
కృష్ణా 30,98,435
నెల్లూరు 15,59,048
సీడెడ్ 91,83,024
బళ్ళారి 15,00,000
నైజాం 1,15,36,943

టోటల్ షేర్ 4,21,33,402