Interview - సూర్య ప్రతాప్ పల్నాటి (18 Pages)

Tuesday,December 20,2022 - 05:42 by Z_CLU

నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన ’18 పేజిస్’ డిసెంబర్ 23న క్రిస్మస్ స్పెషల్ గా రిలీజ్ అవ్వబోతుంది. ఈ సందర్భంగా  దర్శకుడు సూర్య ప్రతాప్ మీడియాతో ముచ్చటించాడు.  డైరెక్టర్ ప్రతాప్ విశేషాలు ఆయన మాటల్లోనే..

 

‘కుమారి 21’ బ్లాక్ బస్టర్ తరువాత ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది.?

ఫస్ట్ మూవీ కరెంట్ అయిపోయాక సుకుమార్ గారి టీం లో రైటింగ్ లో జాయిన్ అయ్యాను. ఆ ప్రాసెస్ లో కుమారి 21ఎఫ్ థాట్ వచ్చింది సుకుమార్ గారికి, నేను ఆ సినిమా చేసేసి బ్లాక్ బస్టర్ అయ్యాక రంగస్థలం సినిమా చేస్తే నాకు ప్లస్ అవుతుంది అని రంగస్థలం, పుష్ప సినిమాలు చేశాను. సుకుమార్ గారితో ట్రావెల్ నేను చాలా విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడింది.

 

 ఈ కథను ఎంచుకోవడానికి కారణం ఏంటి.?

ఈ కథలో కేరక్టర్స్ జర్నీ ఉంటుంది.  వాళ్ళ ప్రపంచంలోకి వెళ్తాము, అన్ని రకాల ఎమోషన్స్ దీనిలో కలిపి ఉంటాయి అందుకు నేను ఈ కథను ఎంచుకున్నాను.

 

ఇది ఎలాంటి లవ్ స్టోరీ.?

ఇది ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఒకటే కాదండీ, దీనిలో బోలెడన్ని ఎమోషన్స్ ఉన్నాయి, సినిమా చూస్తున్న రెండు గంటలు మాత్రం ఆడియన్స్ వాళ్ళని వాళ్లే క్వశ్చన్ చేసుకుంటారు. ఈ సినిమాలో ఫీలింగ్ ఉంటుంది కనెక్టవిటీ ఉంటుంది, ఫన్ ఉంటుంది. ఏమి జరుగుతుందా అనే చిన్న థ్రిల్లింగ్ ఉంటుంది. సినిమా ఎండింగ్ మాత్రం అలా గుర్తుండిపోతూ బయటకు వస్తారు.

 

కార్తికేయ 2 తరువాత నిఖిల్ ఫేమ్ మారిపోయింది.? సో ఈ కథలో ఎలాంటి మార్పులు చేసారు.?

కథని కథలానే ట్రీట్ చేస్తాం అండి. మేము స్ట్రాంగ్ నమ్మేది కథను మాత్రమే, నా గురువు సుకుమార్ అన్నయ్య నేర్పించింది ఏంటి అంటే ఇక్కడ కథే గొప్పది. నిఖిల్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు కాబట్టి నేను ఖచ్చితంగా కొన్ని మార్పులు చెయ్యాలి కానీ అవి కథాపరంగా చెయ్యలేదు. అలానే నిఖిల్ కూడా నేను పాన్ ఇండియా స్టార్ అయినా కానీ, నాకు ఏ కథ చెప్పారో ఆ కథే తియ్యాలి ప్రతాప్ అనేవాడు.

 

మైత్రి మూవీ లో ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు కదా అది చెప్పండి.?

మైత్రిలో ఎప్పటినుంచో సినిమా చెయ్యాల్సిఉంది. నెక్స్ట్ మైత్రిలో ఉండొచ్చు,అలానే సితార ఎంటెర్టైమెంట్స్ లో కూడా ఒక సినిమా చెయ్యాల్సి ఉంది. సుకుమార్ గారు దగ్గర 5 కథలు తీసుకున్న వాటిలో రెండు అయ్యాయి. మిగతా మూడు కథలు ఇంకా చెయ్యాలి, అలానే నేను రాసిన ఒక కథ కూడా ఒకే అయింది.

 

ట్రైలర్ లో కొంచెం కథ చెప్పేసారు, అలా ఊహించిన వాళ్లకు కూడా ఈ సినిమా సప్రైజింగ్ గా ఉంటుందా.?

మనము ఒక జిలేబి తింటున్నప్పుడు అది మనకు తెలుసు, జిలేబి తియ్యగుంటుదని కూడా తెలుసు, కానీ జిలేబి తిన్న తరువాత దానిని ఆస్వాదిస్తాం , స్వీట్ నెస్ ఉంటుంది చూసావా అంతే.సినిమా కథ వాళ్ళు అనుకున్నది ఉండొచ్చు, కానీ ఆ జర్నీ ఇంపార్టెంట్. అదే నేను సినిమా ట్రైలర్ లో చూపించాను క్లియర్ గా.

 

గీతా ఆర్ట్స్ సంస్థ గురించి ?

గీతా ఆర్ట్స్ లో చేయడం నిజంగా ఒక హానర్, మీరు ఎక్కడ చేస్తున్నారు అని బయట అడిగినప్పుడు గీతా ఆర్ట్స్ లో చేస్తున్నాం అంటే మనకు ఒక గౌరవం వస్తుంది. అలానే గీతా ఆర్ట్స్ కి ఒక కథ తీసుకొచ్చినప్పుడు కథకు సంబంధించి మీరు కాంప్రమైజ్ అయినా, వాళ్ళు అవ్వనివ్వరు. అరవింద్ గారు వాసు గారు.