సెన్సార్ ఫినిష్ చేసుకున్న 'పైసా వసూల్' రిలీజ్ కి రెడీ..

Thursday,August 24,2017 - 04:55 by Z_CLU

బాలయ్య -పూరి కాంబినేషన్ లో మచ్ ఎవైటింగ్ మూవీగా తెరకెక్కుతున్న ‘పైసా వసూల్’ సెన్సార్ వర్క్ ఫినిష్ చేసుకొని రిలీజ్ రెడీ అయింది. ఇటీవలే స్టంపర్, ట్రైలర్ తో భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 1 నుంచి థియేటర్స్ లో గ్రాండ్ గా హంగామా చేయబోతుంది.

బాలయ్య డిఫరెంట్ లుక్ తో మాస్ క్యారెక్టర్ తో పూరి హీరోయిజంతో ఎంటర్టైన్ చేయబోతున్న ఈ సినిమాలో శ్రియ హీరోయిన్ గా నటించగా, కైరా దత్, ముస్తాన్ లు స్పెషల్ రోల్స్ లో కనిపించనున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.