'పైసా వసూల్' ఆడియో రిలీజ్ డీటెయిల్స్

Sunday,August 13,2017 - 09:30 by Z_CLU

బాలయ్య -పూరి కాంబినేషన్ లో మోస్ట్ ఎవైటింగ్ మూవీ గా తెరకెక్కుతున్న ‘పైసా వసూల్’ ఆడియో రిలీజ్ కి రెడీ అయింది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆడియోను ఈ నెల 17 న ఖమ్మంలో గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్న మేకర్స్ ఇదే వేడుకలో థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ వేడుకకు సినిమా యూనిట్ తో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా హాజరు కానున్నారని సమాచారం.

ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి రీసెంట్ గా రిలీజైన స్టంపర్ సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేస్తూ అందరినీ ఎట్రాక్ట్ చేసి సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది.

సెప్టెంబర్ 1 న రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న ఈ సినిమాలో బాలయ్య మాఫియా డాన్ లా కనిపించనున్నాడు. శ్రియ హీరోయిన్ గా నటించగా, కైరా దత్, ముస్తాన్ లు స్పెషల్ రోల్స్ చేస్తున్నారు.