పైసా వసూల్ వినాయక చవితి కానుక

Friday,August 25,2017 - 03:06 by Z_CLU

బాలయ్య అభిమానుల కోసం వినాయక చవితి కానుకగా మరికొన్ని స్టిల్స్ రిలీజ్ చేశారు. ఈసారి కేవలం బాలయ్య మాత్రమే స్టిల్స్ లో కనిపించేలా ప్లాన్ చేశారు. ఇప్పటికే పైసా వసూల్ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. దశలవారీగా విడుదల చేస్తున్న సాంగ్ టీజర్స్ సినిమాపై హైప్ ను ఇంకాస్త పెంచుతున్నాయి. వీటికి తోడు తాజాగా రిలీజ్ చేస్తున్న పోస్టర్లు.. పైసా వసూల్ ను హాట్ కేక్ గా మార్చేశాయి.

ఇప్పటికే సెన్సార్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న థియేటర్లలోకి రానుంది. శ్రియ, ముస్కాన్, కైరా దత్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకుడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.