పైసా వసూల్ : ఇది పంచ్ డైలాగ్స్ ఫెస్టివల్

Tuesday,August 15,2017 - 01:02 by Z_CLU

స్టంపర్ తో ఇప్పటికే పంచ్ ల మీద పంచ్ లు రుచిచూపించాడు బాలయ్య. పూరి రాసిన డైలాగ్స్ ను తనదైన స్టయిల్ లో చెప్పి పైసా వసూల్ సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చాడు. ఇప్పుడా సినిమా నుంచి మరిన్ని పంచ్ డైలాగులు రాబోతున్నాయి. అది కూడా మరో 3 రోజుల్లో.

ఈనెల 17న ఖమ్మంలో పైసా వసూల్ పాటల్ని విడుదల చేయబోతున్నారు. గ్రాండ్ గా చేయబోతున్న ఆ ఈవెంట్ లో థియేట్రికల్ ట్రయిలర్ ను కూడా లాంచ్ చేస్తారు. ఆ ట్రయిలర్ లో ఫుల్ గా పంచ్ డైలాగ్స్ ను దట్టించారట. ఈ సినిమాలో వరుసపెట్టి డైలాగ్స్ ఉంటాయని పూరి జగన్నాథ్ ఇప్పటికే స్పష్టంచేశాడు. మచ్చుకి స్టంపర్ లో కొన్ని చూపించాడు. ట్రయిలర్ లో ఆ డోస్ ఇంకాస్త ఎక్కువ ఉంటుందట.

నందమూరి బాలయ్య -పూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ స్టయిలిష్ ఎంటర్ టైనర్ ను సెప్టెంబర్ 1న రిలీజ్ చేయబోతున్నారు. శ్రియ, ముస్కాన్, కైరా దత్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.