బాలయ్య పక్కా జెంటిల్ మేన్ - కైరా దత్

Thursday,July 27,2017 - 07:02 by Z_CLU

‘పైసా వసూల్’ హీరోయిన్ బాలయ్యపై ఫిదా అయిపోయింది. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రియా శరణ్ తో పాటు నటిస్తున్న మరో హీరోయిన్ కైరాదత్, బాలయ్యను పొగిడేస్తూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

రీసెంట్ గా బాలకృష్ణ తో డిన్నర్ డేట్ కి వెళ్ళిన కైరా, బాలయ్య వ్యక్తిత్వాన్ని ఆకాశానికి ఎత్తేసింది. బాలయ్యది గోల్డెన్ హార్ట్ అని పొగిడిన కైరా, బాలయ్యను ట్రూ జెంటిల్ మెన్ అని సర్టిఫికేట్ కూడా ఇచ్చేసింది. దీనికన్నా ముందు సెట్స్ లో బాలయ్య స్టంట్ మ్యాన్ లేకుండా స్టంట్స్ చేయడం చూసి, ఆ విషయాన్ని కూడా ట్విట్టర్ లో షేర్ చేసుకుందీ పైసా వసూల్  భామ.

బాలయ్యని ఇలా కో స్టార్స్ పొగడటం ఫస్ట్ టైమ్ కాదు,  సెట్స్ లో చాలా జోవియల్ గా ఉండే బాలయ్యను ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఇప్పుడు ఆ అకౌంట్ లోకి కైరా కూడా ఆడ్ అయింది. ఇకపోతే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాను సెప్టెంబర్ 29 రిలీజ్ చేయనున్నారు.