పైసా వసూల్ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్సయింది

Tuesday,August 01,2017 - 05:02 by Z_CLU

టాలీవుడ్ మోస్ట్ అవేటింగ్ ఫిల్మ్ ‘పైసా వసూల్’ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి  మ్యూజిక్ కంపోజర్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా యూనిట్,  ఈ నెల 17 న ఖమ్మం లో ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకోనుంది.

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. రీసెంట్ గా రిలీజైన స్టంపర్ తో, సినిమా స్టాండర్డ్స్ ని ఎలివేట్ చేసిన ‘పైసా వసూల్’ టీమ్, ఈ సినిమా ఆడియోతో మరింత ఎట్రాక్ట్  చేయబోతున్నారు.

సెప్టెంబర్ 1 న రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న ఈ సినిమాలో బాలయ్య మాఫియా డాన్ లా కనిపించనున్నాడు. శ్రియ హీరోయిన్ గా నటించగా,  కైరా దత్, ముస్తాన్ లు స్పెషల్ రోల్స్ చేస్తున్నారు.