మరోసారి వాయిదాపడిన గోపీచంద్ సినిమా

Saturday,October 21,2017 - 05:02 by Z_CLU

లెక్కప్రకారం ఈనెల 27న ఆక్సిజన్ విడుదల కావాలి. కానీ గోపీచంద్ హీరోగా నటించిన ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం నవంబర్ 10కి ఈ సినిమాను వాయిదా వేశారు. అక్టోబర్ 23న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ చేయబోతున్నారు. ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా వచ్చే ఛాన్స్ ఉంది.

జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది ఆక్సిజన్ సినిమా. రాశి ఖన్నా, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. ఓ కీలక పాత్రలో జగపతిబాబు కనిపించబోతున్నాడు. ఇప్పటికే సాంగ్స్ తో పాటు ట్రయిలర్ కూడా విడుదలైంది.