నెల్లూరులో `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్

Wednesday,October 11,2017 - 09:01 by Z_CLU

ఏదైనా సినిమా ఫంక్షన్ చేయాలంటే ఫస్ట్ ఆప్షన్ హైదరాబాద్. కాస్త వెరైటీగా చేయాలనుకుంటే వైజాగ్ లేదా విజయవాడ వెళ్తారు. కానీ నెల్లూరులో సినిమా ఫంక్షన్ చేయాలని నిర్ణయించాడు గోపీచంద్. తన కొత్త సినిమా ఆక్సిజన్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను నెల్లూరులో ప్లాన్ చేశాడు. ఈనెల 15న శ్రీ కస్తూరి దేవి గార్డెన్స్ లో ఈ సినిమా పాటల వేడుకను నిర్వహించనున్నారు.

ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది `ఆక్సిజన్`. గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఇమ్యాన్యుయేల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీత దర్శకుడు.


ఆక్సిజన్ ఫ‌స్ట్ కాపీ సిద్ధ‌మైంది. అక్టోబ‌ర్ 27న సినిమాను విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు. ముంబై, గోవా, సిక్కిం, చెన్నై త‌దిత‌ర ప్రాంతాల్లో మేకింగ్‌లో ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని రూపొందించారు. జ‌గ‌ప‌తిబాబుగారు సినిమాలో కీల‌క‌పాత్ర పోషించారు. ఆయ‌న న‌ట‌న‌కు సినిమాకు పెద్ద ప్ల‌స్ అవుతుందని నమ్ముతోంది యూనిట్.