అప్పుడు బన్నీ కోసం ఇప్పుడు చెర్రీ కోసం

Wednesday,December 14,2016 - 11:15 by Z_CLU

సుకుమార్ సినిమాలంటేనే అవుట్ స్టాండింగ్ స్క్రీన్ ప్లే. ఆ స్క్రీన్ ప్లే సొంత కథకి జత చేస్తే ఆ సినిమా రికార్డులు బ్రేక్ చేసి కానీ కూల్ అవ్వదు. తెలుగులో 6 సూపర్ హిట్ సినిమాలకు డైరెక్షన్ చేసిన ఈ ఇంటెలిజెంట్ డైరెక్టర్, సొంత కథను వాడింది ఒక్క ఆర్య సినిమాకే. ఆ తరవాత మళ్ళీ సొంత స్టోరీతో సినిమా చేయలేదు.

అప్పుడెప్పుడో పర్టికులర్ గా బన్ని కోసమో, లేకపోతే ఫస్ట్ సినిమా కాబట్టి రిస్క్ ఎందుకులే మనమే ట్రై చేద్దాం అని రాసుకున్నాడో తెలీదు కానీ, ఆ తర్వాత సుకుమార్ వేరే రైటర్స్ దగ్గర తీసుకున్న కథలతోనే సినిమాలు చేశాడు. కానీ ‘ఆర్య’ తరవాత మరో లవ్ స్టోరీకి యాక్షన్ చెప్పబోతున్న సుకుమార్ ఈ సారి తానే కథ రాసుకున్నాడు.

సుకుమార్ రాసుకున్న ఆర్య ఆల్ మోస్ట్ ఇండస్ట్రీ బ్రేక్ చేసి బ్యాగ్ లో వేసేసుకుంది. అందుకే సుకుమార్ రామ్ చరణ్ కోసం మళ్ళీ కథ రాసుకున్నాడు అనగానే అందరిలోనూ ఆర్య క్రియేట్ చేసిన సెన్సేషన్ కళ్ళ ముందు తిరుగుతుంది.  ఏది ఏమైనా ఈ కాంబో సినిమా అనౌన్స్ చేసినప్పుడు కలిగిన ఎగ్జైట్ మెంట్ ఈ న్యోస్ తెలియగానే ఇంకాస్త ఇంక్రీజ్ అయిపోయింది.