ఆ వార్తల్లో నిజం లేదు అవన్నీ రూమర్స్ - నిర్మాత డి.సురేష్ బాబు

Saturday,July 23,2016 - 03:25 by Z_CLU

 

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనవడు, డి సురేష్ బాబు తనయుడు, కథానాయకుడు రానా సోదరుడు దగ్గుబాటి అభిరామ్ హీరో అవుతున్నాడంటూ వస్తున్న వార్తల పై ప్రముఖ నిర్మాత నిర్మాత డి సురేష్ బాబు నోరు విప్పారు. అయితే ఇప్పటి వరకూ తాను అభిరామ్ తో కలిసి ఇంకా సరైన డిసిషన్ తీసుకోలేదని. దాని గురించి అసలు ఇంకా ఆలోచించలేదని ఆయన తెలిపారు. అయితే ఇటీవలే దగ్గుబాటి కుటుంబం నుండి మరో కథానాయకుడు వెండి తెర కు పరిచయం కానున్నాడన్న వార్తలు మీడియా లో వస్తుండడం పై ఇటీవలే నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ని ఈ విషయం పై ప్రశ్నించగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పటి వరకూ మా అబ్బాయి అభిరామ్ హీరో అవుతున్నాడని వస్తున్న వార్తల్లో నిజం లేదని అవన్నీ రూమర్స్ అని తేల్చి చెప్పేశారు సురేష్ బాబు.