శాతకర్ణి సినిమాలో ఆస్కార్ కంటెంట్

Tuesday,December 27,2016 - 07:37 by Z_CLU

బాలయ్య నటిస్తున్న గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు ఆస్కార్ అవార్డులకు ఎలాంటి సంబంధం లేదు. ఈ సినిమా ఆస్కార్ సాధిస్తుందని ఎక్స్ పెక్ట్ చేయడం కూడా అత్యాశ అవుతుంది. కానీ ఈ సినిమా హాలీవుడ్ లో తీసి ఉంటే కచ్చితంగా ఆస్కార్ అవార్డు వచ్చి ఉండేదని అంటున్నాడు డైరక్టర్ క్రిష్. గౌతమీపుత్ర శాతకర్ణి సాంగ్స్ ను తిరుపతిలో అట్టహాసంగా రిలీజ్ చేశారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమక్షంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సినిమా పాటల్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన క్రిష్.. “బాలకృష్ణ ఈ కథను 10 నిమిషాల్లో ఒకే చేశారు. 14 గంటల్లో అనౌన్స్‌ చేశారు. అప్పటినుంచి ప్రణాళిక బద్ధంగా సినిమా తీశాం. గౌతమిపుత్ర లాంటివాడు గ్రీస్‌లో పుట్టి ఉంటే. 100 పుస్తకాలు రాసేవారు. 10 సినిమాలు తీసేవారు. మూడు ఆస్కార్లు వచ్చేవి.” అని అన్నారు.
gps-2
ప్రతి ఫంక్షన్ లో సింపుల్ గా కనిపించే బాలయ్య… శాతకర్ణి ఆడియో ఫంక్షన్ కు మాత్రం సంథింగ్ స్పెషల్ గా వచ్చారు. సినిమాలే కనిపించినట్టుగానే, రాజసం ఉట్టిపడే కాస్ట్యూమ్ లో వచ్చి అందర్నీ ఎట్రాక్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ హేమమాలిని, హీరోయిన్ శ్రియ కూడా పాల్గొన్నారు. కేవలం 80రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేసుకున్న గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా… సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది.