ఆస్కార్ 2020.. దక్షిణ కొరియా సినిమా విన్నర్

Monday,February 10,2020 - 12:09 by Z_CLU

92వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజెల్స్ లో గ్రాండ్ గా జరిగింది. ఈసారి అవార్డుల్లో హాలీవుడ్ కు పోటీగా నిలిచిన ఓ దక్షిణ కొరియా సినిమా విన్నర్ గా నిలిచింది. దక్షిణ కొరియాకు చెందిన పారసైట్ సినిమా, బెస్ట్ మూవీ అవార్డ్ తో పాటు ఏకంగా 4 విభాగాల్లో అవార్డులు గెలుచుకొని రికార్డు సృష్టించింది. ఉత్తమ చిత్రం అవార్డ్ తో పాటు ఉత్తమ దర్శకుడు, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం విభాగాల్లో ఈ సినిమాకు అవార్డులు వచ్చాయి.

ధనిక-పేద మధ్య అంతరాన్ని వినోదాత్మకంగా చూపించింది పారసైట్ సినిమా. పొట్టకూటి కోసం ఓ ధనిక కుటుంబం వద్ద పనికి చేరుతారు నలుగురు వ్యక్తులు. ఒకరి తర్వాత ఒకరుగా వెళ్లి ఉద్యోగాలు సంపాదించిన ఆ నలుగురు, ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు. అప్పటికే అక్కడ పనిలో ఉన్న మరో కుటుంబాన్ని ఈ నలుగురు కుతంత్రాలు పన్ని బయటకు పంపించేస్తారు. ట్విస్ట్ ఏంటంటే.. ఆ నలుగురిది ఒకే కుటుంబమని ధనిక కుటుంబానికి తెలియదు, ఉద్యోగం కోల్పోయిన మరో పేద కుటుంబం మాత్రం ఆ విషయాన్ని పసిగడుతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలతో వినోదాత్మకంగా, హార్ట్ టచింగ్ గా తెరకెక్కింది పారాసైట్ సినిమా.

ఈసారి అంతా ఊహించినట్టుగానే ఉత్తమ నటుడిగా జోక్విన్ ఫీనిక్స్ నిలిచాడు. జోకర్ సినిమాలో ఇతడి యాక్టింగ్ కు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. ఇక ఉత్తమ సహాయ నటుడిగా బ్రాడ్ పిట్ (ఒన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్) మరోసారి ఆస్కార్ ను ఇంటికి తీసుకెళ్లాడు.

ఆస్కార్ అవార్డ్స్ 2020
ఉత్తమ చిత్రం : పారసైట్ (దక్షిణ కొరియా)
ఉత్తమ నటుడు : ఫీనిక్స్ (జోకర్)
ఉత్తమ నటి : రెంజి జెల్వెగర్ (జూడి)
ఉత్తమ సహాయ నటుడు : బ్రాడ్‌పిట్‌ ( వన్స్‌ అపాన్‌ ఏ టైమ్ ఇన్‌ హాలీవుడ్‌)
ఉత్తమ సహాయ నటి : లారా డెర్న్ (మ్యారేజ్ స్టోరీ)
ఉత్తమ దర్శకుడు : బాంగ్ జోన్-హో (పారసైట్)
ఉత్తమ సంగీతం : జోకర్‌ (హిల్దార్‌)
బెస్ట్ మ్యూజిక్ ఒరిజనల్ సాంగ్ : ఐయామ్ గోన్నా.. లవ్ మీ ఎగేన్ (రాకెట్ మ్యాన్)
ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ : పారాసైట్‌
మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌ : బాంబ్‌ షెల్‌
ఉత్తమ డాక్యుమెంటర్‌ షార్ట్‌ ఫీచర్‌ : అమెరికర్‌ ఫ్యాక్టరీ
బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే : టైకా వైటిటి( జోగో ర్యాబిట్‌)
బెస్ట్‌ యానిమేటేడ్‌ ఫీచర్‌: టాయ్‌ స్టోరీ 4
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్‌ : అమెరికన్ ఫ్యాక్టరీ
బెస్ట్‌ లైవ్‌ యాక్షన్ షార్ట్‌: ది నైబ‌ర్స్ విండో
ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే : బాంగ్‌ జూన్‌ హో( పారాసైట్‌)
బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ : లెర్నింగ్ టూ స్కేట్‌బోర్డ్ ఇన్ ఏ వార్ జోన్ ( ఇఫ్ యుఆర్ ఏ గ‌ర్ల్‌)
బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ : హెయిర్‌ లవ్‌
బెస్ట్‌ ఫిల్మ్‌ ఎడిటింగ్‌ : ఫోర్డ్ వి ఫెరారీ
బెస్ట్‌ సౌండ్‌ మిక్సింగ్‌ : 1917
ఉత్తమ సినిమాటోగ్రఫీ : 1917
ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్‌ : 1917
బెస్ట్‌ సౌండ్‌ ఎడిటింగ్‌ : ఫోర్డ్ వి ఫెరారీ
ఉత్తమ​ ప్రొడెక్షన్‌ డిజైన్‌ : వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌
బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ : ది నైబర్స్‌ విండో