Orey Bujjiga - వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్
Saturday,December 12,2020 - 09:02 by Z_CLU
ఓటీటీలో వచ్చి సూపర్ హిట్టయిన Orey Bujjiga సినిమా ఇప్పుడు టీవీ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అయింది. RajTarun హీరోగా నటించిన ఈ సినిమా రేపు సాయంత్రం ZeeTelugu ఛానెల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కానుంది.
విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లాక్ డౌన్ టైమ్ లో ప్రేక్షకులకు ఫుల్ లెంగ్త్ వినోదాన్ని అందించింది. కంప్లీట్ రొమాంటిక్-కామెడీ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ మూవీ, ఇప్పుడు బుల్లితెర వీక్షకుల్ని కూడా అదే రేంజ్ లో ఎంటర్ టైన్ చేయబోతోంది.
రేపు సాయంత్రం 5 గంటల నుంచి జీ తెలుగులో ఒరేయ్ బుజ్జిగా హంగామా ప్రారంభం కాబోతోంది.
Orey Bujjiga సినిమాలో చాలా ఎట్రాక్షన్స్ ఉన్నాయి. రాజ్ తరుణ్ ఎనర్జిటిక్ పెర్ఫార్పెన్స్, మాళవిక నాయర్, హెబ్బా పటేల్ క్యూట్ లుక్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. వీటికి తోడు సూపర్ హిట్ సాంగ్స్ ఈ సినిమాకు మరో ఎట్రాక్షన్.

హీరోహీరోయిన్లతో పాటు వాణీ విశ్వనాథ్, సీనియర్ నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సత్య, మధు నందన్ లాంటి ఆర్టిస్టులతో కలర్ ఫుల్ గా తెరకెక్కింది ఒరేయ్ బుజ్జిగా.