'ఒరేయ్ బుజ్జిగా' టీజర్.. మరో గమ్మత్తైన ట్విస్ట్

Wednesday,March 04,2020 - 07:08 by Z_CLU

రాజ్ తరుణ్ నుంచి మరో సినిమా వస్తోంది. దాని పేరు ఒరేయ్ బుజ్జిగా. టైటిల్ ఎంత ఎంటర్ టైనింగ్ గా ఉందో, కాసేపటి కిందట విడుదలైన టీజర్ కూడా అంతే ఎంటర్ టైనింగ్ గా ఉంది.

గుండెజారి గల్లంతయ్యిందే ఫేమ్ విజయ్ కుమార్ కొండ డైరక్ట్ చేసిన ఈ రొమాంటిక్ ట్రయాంగులర్ స్టోరీలో ఏదో గమ్మత్తైన ట్విస్ట్ ఉందనే విషయం టీజర్ చూస్తేనే అర్థమౌతోంది. చూస్తుంటే.. విజయ్ కుమార్ మరోసారి తన హిట్ మూవీ ‘గుండెజారి..’ సినిమా టైపులో రొమాంటిక్ ట్విస్ట్ పెట్టినట్టున్నాడు.

ఎప్పట్లానే రాజ్ తరుణ్ ఎనర్జిటిక్ గా కనిపించాడు. మాళవిక నాయర్, హెబ్బా పటేల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25న విడుదల చేస్తున్నారు.