థియేట‌ర్‌ల‌లో జ‌న‌వ‌రి1న ‘ఒరేయ్‌ బుజ్జిగా...`

Saturday,December 05,2020 - 12:03 by Z_CLU

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్, హెబా ప‌టేల్‌ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఒరేయ్ బుజ్జిగా. శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా…`. ఈ చిత్రం నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా జ‌న‌వ‌రి 1న థియేట‌ర్‌ల‌లో విడుద‌ల‌వుతుంది.

చిత్ర నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ – “2021కి స్వాగ‌తం ప‌లుకుతూ నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా మా బేన‌ర్‌లో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్, హెబా ప‌టేల్ ‌ హీరోహీరోయిన్లుగా కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఒరేయ్ బుజ్జిగా..`ను జ‌న‌వ‌రి 1న గ్రాండ్‌గా విడుద‌ల‌చేస్తున్నాం“ అన్నారు.

ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో విడుదలైంది. త్వరలోనే జీ తెలుగు ఛానెల్ లో కూడా టెలికాస్ట్ కాబోతోంది. థియేటర్లు మళ్లీ తెరుచుకోవడంతో ఇప్పుడు మరింతమంది ప్రేక్షకులకు చేరువయ్యేందుకు ఇలా థియేటర్లలో సందడి చేయబోతోంది.

Also Check – ఒరేయ్ బుజ్జిగా రివ్యూ