'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' రిలీజ్ డేట్ ఫిక్స్

Thursday,September 26,2019 - 04:12 by Z_CLU

‘వినాయకుడు’, ‘విలేజ్ లో వినాయకుడు’, ‘కేరింత’ లాంటి సెన్సిబుల్ సినిమాలతో విజయాలు అందుకున్న సాయికిరణ్ అడివి, ఈసారి కాశ్మీర్ పండిట్ల సమస్యను వెండితెరపై ఆవిష్కరించడానికి రెడీ అయ్యారు. అదే ఆపరేషన్ గోల్డ్ ఫిష్.

ఆది సాయికుమార్ హీరోగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి విలన్ గా తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. U/A వచ్చింది. అక్టోబర్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

వాస్తవ ఘ‌ట‌న‌లకు ఫిక్షన్ జోడించి తీసిన సినిమా ఇది. ఎన్.ఎస్.జి కమాండోగా ఆది సాయికుమార్, ఘాజీ బాబా పాత్రలో అబ్బూరి రవి, ఫరూఖ్ ఇక్బాల్ ఇరాఖీగా మనోజ్ నందం, ఇంకా శ‌షా చెట్రి, కృష్ణుడు, నిత్యా నరేష్, పార్వతీశం, కార్తీక్ రాజు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందించగా.. సినిమాలో దేశభక్తి గీతాన్ని ఎంఎం కీరవాణి ఆలపించడం విశేషం. ఆ పాటను రామజోగయ్య శాస్త్రి రాశారు.

ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మ్యాచో మ్యాన్ రానా దగ్గుబాటి విడుదల చేయగా, ఈ చిత్రంతో నటుడిగా పరిచయం అవుతున్న అబ్బూరి రవి లుక్ ను ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్… సినిమాలో బ్యాడ్ బాయ్ గా నటించిన మనోజ్ నందం ఫస్ట్ లుక్ ను సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ విడుదల చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా టీజర్ ఆవిష్కరించారు.