స్పీడ్ తగ్గించనున్న విజయ్ దేవరకొండ

Sunday,November 18,2018 - 02:01 by Z_CLU

ప్రస్తుతం జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తూ దూసుకెల్తున్నాడు విజయ్ దేవరకొండ… ఈ ఏడాది విజయ్ నటించిన మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి.. ఈ మూడు సినిమాల షూటింగ్ ప్రమోషన్స్ తో బాగా అలిసిపోయిన విజయ్ ఇకపై స్పీడ్ తగ్గించనున్నట్లు ప్రకటించాడు. ఇటివలే టాక్సీ వాలా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన విజయ్  నెక్స్ట్ సినిమా నుండి సినిమా సినిమాకు కాస్త గ్యాప్ గ్యాప్ తీసుకుంటానని, ఏడాదికో ఒకటి   లేదా రెండు సినిమాలు  మాత్రమే చేస్తానని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం విజయ్ నటిస్తున్న డియర్ కామ్రేడ్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది. క్రాంతి మాధవ్ తో చేసే సినిమా ఇంకా సెట్స్ పైకి  వెళ్ళలేదు కాబట్టి… ఆ సినిమా  వచ్చే  ఏడాది చివర్లో థియేటర్స్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. సో విజయ్ నుండి నెక్స్ట్ ఇయర్ రెండు సినిమాలే అన్నమాట.