స్పీడ్ తగ్గించిన నాని

Monday,January 14,2019 - 09:01 by Z_CLU

2015 నుంచి  గతేడాది మినహా మూడేళ్ళ పాటు నాని నుండి మూడు సినిమాలు విడుదలయ్యాయి. లాస్ట్ ఇయర్  నాని నుండి ‘కృష్ణార్జున యుద్ధం’,’దేవదాస్’ సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. అయితే ఈ ఏడాది కూడా నాని నుండి రెండు సినిమాలు మాత్రమే రానున్నాయి.

లాస్ట్ ఇయర్ నుండి కాస్త స్పీడ్ తగ్గించిన నాని ఏడాదికి రెండు సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. ఏప్రిల్ లో జెర్సీ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్న నాని ఏడాది చివర్లో విక్రం కుమార్ సినిమాతో థియేటర్స్ లోకి రావాలని చూస్తున్నాడు. తనకి ‘ఎం.సి.ఎ’ తో కలిసొచ్చిన క్రిస్మస్ సీజన్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తునాడు.

ఈ రెండు సినిమాలతో ఈ ఏడాది థియేటర్స్ లో సందడి చేయనున్న నాని వచ్చే ఏడాది కూడా రెండు సినిమాలే ప్లాన్ చేస్తాడా.. లేదా మళ్ళీ స్పీడ్ పెంచి మూడు సినిమాలు రిలీజ్ చేస్తాడా …చూడాలి.