లేటెస్ట్ బజ్.. RRRలో పాటలు

Wednesday,September 18,2019 - 12:23 by Z_CLU

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ బయటకొస్తూనే ఉన్నాయి. వీటిలో కొన్ని అప్ డేట్స్ ఉంటే, మరికొన్ని గాసిప్స్ ఉంటున్నాయి. తాజాగా వినిపిస్తున్న అప్ డేట్ మాత్రం కాస్త అటుఇటుగా ఉంది. అదేంటంటే.. RRRలో కేవలం 3 పాటలే ఉంటాయట.

సినిమాలో చరణ్ పై ఓ డ్యూయట్, ఎన్టీఆర్ పై మరో డ్యూయట్ ఉంటుందట. ఇక మూడో పాటను ఎన్టీఆర్-చరణ్ పై జాయింట్ గా తీస్తారట. వీటితో పాటు ఓ నాలుగో సాంగ్ కూడా ఉందట. కాకపోతే అది మాంటేజ్ సాంగ్. ప్రస్తుతం RRRపై నడుస్తున్న లేటెస్ట్ రూమర్ ఇదే.

బాహుబలి టైపులో కాకుండా ఈ సినిమాను తక్కువ రన్ టైమ్ లో పూర్తిచేయబోతున్నారు. పైగా పాన్-ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా అన్ని భాషల్లో ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఇలా పాటల్ని కుదించారట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి బల్గేరియాలో ఓ షెడ్యూల్ నడుస్తోంది. ఎన్టీఆర్ పై ఈ షూట్ కొనసాగుతోంది. బల్గేరియాలో ఎన్టీఆర్ పై ఓ పులిఫైట్ షూట్ చేశారట.