బాలయ్య నుంచి ఒక్కటే ...

Sunday,February 18,2018 - 01:10 by Z_CLU

ఇటివలే షోల్డర్ కి సర్జరీ చేయించుకొని రెస్ట్ తీసుకుంటున్న బాలయ్య త్వరలోనే ‘ఎన్టీఆర్’ సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవ్తున్నాడు. ప్రస్తుతం ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న నందమూరి నటసింహం ఈ ఏడాది మాత్రం ఒకే సినిమాతో సరిపెట్టుకోబోతున్నాడట.

ప్రస్తుతం తను నటించనున్న ఎన్టీఆర్ బయోపిక్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న బాలయ్య ఈ సినిమా అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే గొప్ప సినిమాగా తీర్చిదిద్దాలని చూస్తున్నాడట. ఈ సినిమాలో తన తండ్రి తారకరామారావు గా కనిపించనున్న బాలయ్య దాదాపు 60 గెటప్స్ లో కనిపిస్తూ అలరించనున్నాడు. ఇప్పటికే ఈ గెటప్స్ కి సంబంధించి లుక్స్ కూడా ఫైనల్ అయిపోయాయని సమాచారం.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాడట బాలయ్య. ఇదే నిజమైతే బాలయ్య నుంచి ఈ ఏడాది మరో సినిమా రాదన్నమాట.