కరోనా ఎఫెక్ట్... ఆన్ లైన్ మ్యూజిక్ సిట్టింగ్స్

Thursday,March 26,2020 - 11:41 by Z_CLU

కరోనా ప్రభావంతో అంతా ఇళ్లకే పరిమితమైపోయారు. మరీ ముఖ్యంగా లాక్ డౌన్ కావడంతో ఎవ్వరూ బయటకు వెళ్లలేని పరిస్థితి. అయితే ఇలాంటి టఫ్ కండిషన్స్ లో కూడా నిఖిల్ సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ నడుస్తున్నాయి.

అవును.. నిఖిల్ కొత్త సినిమా 18 పేజెస్ కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి. సంగీత దర్శకుడు గోపీసుందర్, దర్శకుడు సూర్యప్రతాప్ ఆన్ లైన్లో మ్యూజిక్ సిట్టింగ్స్ చేస్తున్నారు. సూర్యప్రతాప్ ఫోన్ లో సందర్భం వివరిస్తుంటే.. గోపీసుందర్ ఆన్ లైన్ లో మ్యూజిక్ కంపోజ్ చేసి అతడికి వినిపిస్తున్నాడు. కరోనా ఎఫెక్ట్ తగ్గేలోగా పాటలు ఫైనలైజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ‘ఉప్పెన’ హీరోయిన్ కృతి శెట్టి పేరు వినిపించగా లేటెస్ట్ గా అను ఇమ్మాన్యుల్ పేరు తెరపైకి వచ్చింది. మేకర్స్ మాత్రం ఫైనల్ గా కృతి శెట్టినే హీరోయిన్ గా లాక్ చేసే ఆలోచనలో ఉన్నారు.

సుకుమార్ కథ-స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇలా ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. కరోనా పరిస్థితులు కుదుటపడిన వెంటనే రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.