మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ చిట్ చాట్

Wednesday,April 15,2020 - 03:30 by Z_CLU

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ సెల్ఫ్ ఐసోలేష‌న్ లో ఉంటూ ఇంటిలో తాను ఈ క్వారంటైన్ స‌మ‌యాన్ని ఎలా గ‌డుపుతున్నారో త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. ట్విట్ట‌ర్ ల‌ైవ్ లో కి వ‌చ్చి మెగా ఫ్యాన్స్ తో ముచ్చ‌ట్టించాడు.

– మీకు ఏ జాన‌ర్ ఫిల్మ్స్ న‌చ్చుతాయి

యాక్ష‌న్ సినిమాలు

– చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్, అల్లు అర్జున్, నాగ‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీరి గురించి ఒక్కో మాట చెప్పండి

చిరంజీవి – న‌న్ను ఎంత‌గానో ఎంక‌రైజ్ చేస్తారు

నాగ‌బాబు – పిల్ల‌ర్ ఆఫ్ స్ట్రెంథ్

ప‌వ‌న్ క‌ళ్యాణ్ – హాన‌స్టీకి మ‌రో పేరు

రామ్ చ‌ర‌ణ్, అల్లు అర్జున్ – ఇద్ద‌రు ఇద్ద‌రే. మంచి హార్డ్ వ‌ర్క‌ర్స్

-క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు ఇష్ట‌మా లేక కంటెంట్ ఉన్న క‌థ‌ల్ని ఇష్ట‌ప‌డ‌తారా

కంచె లాంటి క‌థ కోసం వెతుకుతున్నా, కంటెంట్ ఉన్న క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేయాల‌నుంది

-మీకు ఇష్ట‌మైన కామిక్ సూపర్ హీరో

ఎల్ల‌ప్పుడూ బాట్ మేన్ కే నా ఓటు

– మీకు ఇష్ట‌మైన బాలీవుడ్ హీరో

ఫారుఖ్ ఖాన్

– ఈ క్వారంటైన్ లో మీరు ఏం చేస్తున్నారు

స్నూక‌ర్ టేబుల్ ఈ మ‌ధ్యనే కొన్నాను, దాంతో బాగా టైమ్ పాస్ అవుతుంది, అలానే ఆన్ లైన్ లో గిటార్ క్లాసులు తీసుకుంటున్నా, అంతేకాదు నెక్ట్స్ సినిమా కోసం ఓ బాక్సింగ్ కోచ్ ను నాతోనే ఉంచుకున్నా, ఈ టైమ్ లో ఆ ప్రాక్టీస్ కూడా జ‌రిగిపోతుంది.

-మీ లాస్ట్ క్ర‌ష్ ఎవ్వ‌ర‌ని డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కి వ‌రుణ్ స‌మాధానం..

నా సినిమా గ‌ద్ద‌ల కొండ గణేశ్ ని డైరెక్ట్ చేసిన హరీశ్ శంక‌ర్ నా లాస్ట్ క్ర‌ష్

– సాయిధ‌ర‌మ్ తేజ్ తో క‌లిసి ఏదైనా మ‌ల్టీస్టార‌ర్ చేసే అవ‌కాశం ఉందా

క‌చ్చితంగా చేస్తాను, నేను వెయిట్ చేస్తున్నా మంచి క‌థ కోసం

ఇక ప్ర‌శ్న‌ల‌తో పాటు త‌న అప్ క‌మింగ్ మూవీ #VT10 గురించి ఫ్యాన్స్ అడిగిన‌ప్పుడు, ప్ర‌స్తుతం ప‌రిస్థితులు అన్ని స‌ర్థుబాటు అవ్వ‌గానే #VT10 గురించి ఓ ఆస‌క్తిక‌ర అప్ డేట్ ఇవ్వ‌డానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నామ‌ని, ప్ర‌స్తుతానికి మ‌నంద‌రం ఇంటిలోనే ఉంటూ, కుటుంబ స‌భ్యుల‌తో ఆనందంగా సేఫ్ గా ఉండాల‌ని తెలిపారు వ‌రుణ్ తేజ్‌