టాప్-10 స్టార్స్: టాలీవుడ్ నుంచి ఒకే ఒక్కడు

Friday,December 08,2017 - 04:45 by Z_CLU

ఇండియన్ సినిమాలో టాప్ స్టార్స్ అనగానే షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాల పేర్లు  వినిపిస్తాయి. ఇప్పుడీ దిగ్గజాల లిస్ట్ లోకి ప్రభాస్ కూడా చేరాడు. 2017లో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న టాప్-10 హీరోల లిస్ట్ లో ప్రభాస్ చేరాడు. ఈ లిస్ట్ లో చోటుదక్కించుకున్న ఒకే ఒక్క టాలీవుడ్ హీరోగా రికార్డు సృష్టించాడు ప్రభాస్. ఇంకా చెప్పాలంటే టోటల్ సౌత్ నుంచి టాప్-10లోకి చేరిన హీరో ప్రభాస్ మాత్రమే.

వరల్డ్ వైడ్ హై స్టాండర్డ్స్ ఉన్న IMDB ఆన్ లైన్  మ్యాగజైన్ 2017కు సంబంధించి ఇండియాలో టాప్ స్టార్స్ ఎవరనే విషయంపై సర్వే నిర్వహించింది. బాహుబలి, బాహుబలి-2 సినిమాలతో నేషన్ వైడ్ పాపులర్ అయిన ప్రభాస్ ఈ లిస్ట్ లో చోటుదక్కించుకున్నాడు. లిస్ట్ లో యంగ్ రెబల్ స్టార్ ది ఆరో స్థానం.

IMDB ప్రొఫైల్స్ లో నెలకు 25 కోట్లు పేజ్ వ్యూస్ నమోదు చేసుకున్న స్టార్స్ మాత్రమే ఈ టాప్-10 లిస్టుకు ఎంపిక అవుతారు. దీన్ని బట్టి చూస్తే రెబల్ స్టార్ ప్రభాస్ కి వరల్డ్ వైడ్ గా ఉన్న క్రేజ్ అర్థంచేసుకోవచ్చు. ఇక సౌత్ హీరోయిన్లకు సంబంధించి మిల్కీబ్యూటీ తమన్నకు 4వస్థానం, అనుష్కకు 8వ స్థానం దక్కాయి.

టాప్-10 లిస్ట్ లో బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ మొదటి 3 స్థానాల్లో నిలిచారు.